వాషింగ్టన్, ఆగస్టు 9: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సంబంధించిన ప్రైవేటు క్లబ్, ఫ్లోరిడాలోని నివాసంపై ఎఫ్‌బీఐ దాడులు జరిపింది. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్‌హౌజ్ నుంచి రహస్య పత్రాలను తీసుకెళ్లారన్న ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించింది. ‘ఫ్లోరిడాలోని నా ఇంటిని ఎఫ్‌బీఐ ఏజెంట్ల స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఏ అధ్యక్షుడికి కూడా ఇలా జరుగలేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌజ్‌ను 2021 జనవరిలో ఖాళీ చేసే సమయంలో 15 డబ్బాల నిండా పత్రాలను తీసుకెళ్లారని, అందులో చాలా ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని నేషనల్ ఆర్కివ్స్ చెప్పినట్టు సమాచారం.