అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) రెయిడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ ఇంట్లో 11 వేలకుపైగా ప్రభుత్వ పత్రాలు దొరికినట్లు ఎఫ్బీఐ అధికారులు చెప్పారు. వీటిలో కీలకమైన ఫొటోలు, టాప్ సీక్రెట్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయట.
శుక్రవారం నాడు కోర్టు రికార్డులను ఓపెన్ చేయగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటితోపాటు ఖాళీగా ఉన్న 90 ఫోల్డర్లను కూడా ఎఫ్బీఐ స్వాధీనం చేసుకుంది. వీటిలో 48పై ‘క్లాసిఫైడ్’ అని రాసుండగా.. 42పై ‘స్టాఫ్ సెక్రటరీ లేదా మిలటరీ ఎయిడ్కు తిరిగిచ్చేయండి’ అని రాసి ఉందని తెలుస్తోంది.