ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ కు పదవీ గండం?
అమెరికాలోని ప్రధాన విచారణ, నిఘా సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌కు పదవీ గండం పొంచి ఉంది. ప్రస్తుతం తన పదవిపై అనిశ్చిత స్థితి ఎదుర్కొంటున్న కాష్ను ఏ క్షణంలోనైనా పదవి నుంచి తొలగిస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.
- త్వరలో ఉద్వాసన పలుకనున్న ట్రంప్
వాషింగ్టన్ : అమెరికాలోని ప్రధాన విచారణ, నిఘా సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌కు పదవీ గండం పొంచి ఉంది. ప్రస్తుతం తన పదవిపై అనిశ్చిత స్థితి ఎదుర్కొంటున్న కాష్ను ఏ క్షణంలోనైనా పదవి నుంచి తొలగిస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ట్రంప్ కార్యనిర్వాహకుల్లో తొలగింపునకు గురయ్యే తర్వాతి పెద్ద అధికారి కాష్ పటేల్ అని వైట్‌హౌస్‌కు చెందిన ఒక అధికారి వెల్లడించారు. కాష్ తొలగింపు ఖాయమని, అది ఎప్పుడు అన్నది చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో శనివారం కాల్పులకు కొద్ది గంటల ముందు కాష్ తొలగింపునకు సంబంధించిన ఒక నివేదిక వెలుగులోకి వచ్చింది. కాష్ గతంలో సిఫార్సు చేసిన పామ్ బాండీని ట్రంప్ ఈ నెల ప్రారంభంలో అటార్నీ జనరల్ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాష్ పనితీరుపై పలు ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. అతని దుష్ప్రవర్తన, సమావేశాలకు గైర్హాజరీ, అధికంగా మద్యం సేవించడం వంటివి ఇందులో ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

