కాన్బెర్రా: ఇరాన్ యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ముప్పు ఎదురవుతున్నదని ‘అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ’ చీఫ్ ఫాతిహ్ బిరోల్ అన్నారు. యుద్ధం ఇదే విధంగా కొనసాగితే.. దీని ప్రభావం నుంచి తప్పించుకోవటం ఏ దేశానికీ సాధ్యం కాదని అన్నారు.
ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో ఆయన సోమవారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 1970లో రెండు చమురు సంక్షోభాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల గ్యాస్ మార్కెట్లపై పడిన ప్రభావం కంటే ఇప్పుడు నెలకొన్న పశ్చిమాసియా సంక్షోభం అత్యంత తీవ్రమైనదని అన్నారు. గ్లోబల్ ఎకానమీపై యుద్ధ ప్రభావం గురించి ఆయన ఇలా హెచ్చరించటం ఇది రెండవసారి.