ఏవైనా రేస్‌లు జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి గుర్రాలు అయినా ఎద్దులు అయినా అవి రెచ్చిపోతే మాత్రం వాటిని ఆపడం ఎవ్వరి తరం కాదు. మన దేశంలో కూడా సంక్రాంతి సమయంలో జల్లికట్టు అంటూ ఎద్దుల పోటీలు పెడతారు. వేరే దేశాల్లో ఎద్దుల రేసింగ్ ఉంటుంది. అది అక్కడ అఫిషియల్. గుర్రాల రేసింగ్ ఎలా ఉంటుందో ఎద్దులతో రేసింగ్ నిర్వహిస్తారు.
అలాంటి ఓ రేసింగ్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎద్దు మీద కూర్చున్న ఓ టీనేజర్ ఏం జరుగుతుందో తేరుకునే లోపే ఆ ఎద్దు రెచ్చిపోయింది. గేట్‌ను విరగొట్టి మరీ.. రేసింగ్ ప్లేస్‌లోకి దూసుకొచ్చి అతడిని కింద పడేసింది. అంతటితో అది ఆగలేదు. కిందపడిపోయిన అతడిపై మళ్లీ దాడి చేసేందుకు ప్రయత్నించింది. కొమ్ములతో అతడిని పొడవబోయింది. ఇంతలో అక్కడికి ఆ టీనేజర్ తండ్రి వచ్చి పడిపోయిన అతడి మీద పడుకొని ఎద్దు దాడి నుంచి అతడిని కాపాడగలిగాడు. ఈ ఘటన టెక్సాస్‌లోని బెల్టన్లో చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రాణాలకు తెగించి కొడుకును కాపాడిన ఆ తండ్రికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.