Who are you Ranveer | అబుదాబిలో ఫార్ములా 1 రేసింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకున్నది. బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌ను మాజీ రేసింగ్ డ్రైవర్ ఒకరు ‘హూ ఆర్ యూ?’ అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఏమాత్రం కోపగించుకోని మన హీరో.. ప్రశాంతంగా వినయపూర్వకంగా సమాధానం ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఆయనను నెటిజెన్లు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.
అబుదాబిలో ఫార్ములా 1 రేసింగ్ కోసం దేశవిదేశాల నుంచి ప్రముఖ రేసర్లు వచ్చారు. ఈ పోటీలను తిలకించేందుకు ఎందరో అతిరథ మహారథులు విచ్చేశారు. తమ అభిమాన రేసర్లకు మద్దతుగా నిలిచేందుకు పలువురు సినీ నటులు కూడా రేసింగ్ ఈవెంట్‌కు వచ్చారు. వీరిలో బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ ఉన్నారు. ఈవెంట్ వ్యాఖ్యాతగా ఉన్న మాజీ రేసింగ్ డ్రైవర్ మార్టిన్ బ్రండిల్.. గ్రిడ్ వాక్ సమయంలో రణ్‌వీర్‌సింగ్‌ను పలుకరించారు. దాంతో హూ ఆర్ యూ? అంటూ ప్రశ్నించాడు. దానికి ఎంతో వినమ్రంగా తనకు తాను ‘ఎంటర్టైనర్’ను అని పరిచయం చేసుకున్నారు. మిమ్మల్ని గుర్తుపట్టలేదు. మర్చిపోయాను. మీరెవరో చెప్పగలరా? అని రణ్వీర్ సింగ్‌ను మార్టిన్ బ్రండిల్ అడగ్గా.. పెద్ద నటుడినన్నా బేషజానికి పోకుండా ‘నేను బాలీవుడ్ నటుడిని సార్. భారత్‌లోని ముంబైకి చెందినవాడిని, ఎంటర్టైనర్ను..’ అంటూ తన గురించి వెల్లడించాడు.
ఈ విషయాన్ని బ్రండిల్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ‘పెద్ద నటుడైనప్పటికీ ఏమాత్రం బేషజానికి పోకుండా వినయపూర్వకంగా సమాధానమిచ్చారు..’ అంటూ రాశారు. రణ్వీర్ సింగ్ సమాధానమిచ్చిన తీరుపట్ల నెటిజెన్లు ఎంతో అభినందిస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ లెజెండ్ అకోన్తో కలిసి ‘చమ్మక్‌చల్లో..’ సాంగ్‌పై ఇద్దరు చేసిన డ్యాన్స్ వీడియోను నెటిజెన్లు షేర్ చేస్తున్నారు.
Lol. Brundle and Ranveer Singh. @depressedsebfan pic.twitter.com/CwMmPFhNkl
— Pranjal Mishra (@justmishra) November 20, 2022