Israeli Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. తగ్గనున్న నెతన్యహూ మెజారిటీ !
Israeli Exit Polls: ఇజ్రాయెల్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏ పార్టీకి మెజారిటీ రావడంలేదు. ప్రధాని బెంజిమన్ నెతన్యహూకు చెందిన లికుడ్ పార్టీ కానీ, మాజీ మిలిటరీ చీఫ్ గాఢి ఐసెన్కోట్కు చెందిన యాసర్ పార్టీ కానీ సంపూర్ణ మెజారిటీ సాధించడం లేదు.
జెరుసలాం: ఇజ్రాయెల్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం(Israeli Exit Polls) ఏ పార్టీకి మెజారిటీ రావడంలేదు. ప్రధాని బెంజిమన్ నెతన్యహూకు చెందిన లికుడ్ పార్టీ కానీ, మాజీ మిలిటరీ చీఫ్ గాఢి ఐసెన్కోట్కు చెందిన యాసర్ పార్టీ కానీ సంపూర్ణ మెజారిటీ సాధించడం లేదు. అయితే బెంజిమన్ నెతన్యహూ పార్టీకి మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కానీ ఆయన కూటమి పార్టీలు మాత్రం రాణించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో 120 సీట్లు ఉన్నాయి. అయితే తాజా ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది.
సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రకారం 77.7 శాతం పోలింగ్ ఝరిగింది. 1999 తర్వాత ఇదే అత్యధిక స్థాయి ఓటింగ్. తుది ఫలితాలను ప్రకటించిన తర్వాత అత్యధిక సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఆహ్వానిస్తారు. కానీ ఈ ప్రక్రియకు కొన్ని వారాలు పట్టే అవకాశం ఉన్నది. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్ష యాషర్ పార్టీకి కాస్త అనుకూలంగా ఫలితాలను ఇవ్వడంతో.. టెల్ అవివ్‌లోని ఆ పార్టీ కార్యాలయం వద్ద భారీగా సంబరాలను నిర్వహించారు. బీబీ గో హోమ్ అన్నారు. యాషర్ పార్టీ కూటమికి అత్యధిక స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నట్లు కెన్నసెట్ పేర్కొన్నది. యాషర్ కూటమికి 52 నుంచి 53 స్థానాలు , ఇక నెతన్యహ కూటమికి 50 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
57 సీట్లతో లీడింగ్‌లో నెతన్యహూ కూటమి
దాదాపు 42 శాతం బ్యాలెట్ బాక్సులను లెక్కించారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పాక్షిక రిపోర్టు ప్రకారం నెతన్యహూ అనుకూల కూటమి 57 సీట్లలో లీడింగ్‌లో ఉన్నది. ఇక ప్రతిపక్ష యాషర్ కూటమి 47 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మిగితా 16 సీట్లు అరబ్ కూటమి పార్టీల ఆధీనంలో ఉన్నాయి. అయితే ఆ పార్టీలు నెతన్యహూకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. సైనికుల ఓట్లను చివరలో లెక్కిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Israeli Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. తగ్గనున్న నెతన్యహూ మెజారిటీ !
Medak | మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కూతుళ్లతో మంజీరా నదిలో దూకి తల్లి ఆత్మహత్య
Venu Udugula | తెలంగాణ సంస్కృతిని కేవలం ప్లేట్లలో, గ్లాసుల్లో వెతకకండి: దర్శకుడు వేణు ఉడుగుల!
Chandrababu | ఆర్నబ్ తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి : సీఎం చంద్రబాబు
Jio IPO | స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా జియో ప్లాట్‌ఫామ్స్ ఎంట్రీ.. 21.36 శాతం ప్రీమియంతో లిస్టింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

