ప్లెయిన్స్: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్(Jimmy Carter).. ఇవాళ వందో పుట్టిన రోజు జరుపుకున్నారు. సెంచరీ మార్క్ కొట్టిన తొలి యూఎస్ ప్రెసిడెంట్గా ఆయన రికార్డు సృష్టించారు. రైతు కుటుంబానికి చెందిన జమ్మి కార్టర్.. అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అసాధారణ రీతిలో ఆయన దేశాధ్యక్ష బాద్యతలు చేపట్టారు. జార్జియాలోని ప్లెయిన్స్లో ప్రస్తుతం ఆయన ఉంటున్నారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన కార్టర్.. ఇంటి వద్దే పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. సుమారు 20 మంది కుటుంబసభ్యలతో ఆయన బర్త్డే లంచ్ పార్టీలో పాల్గొన్నారు. ప్రెసిడెంట్ బైడెన్ తన ఎక్స్ అకౌంట్లో కార్టర్కు బర్త్డే విషెస్ తెలిపారు.
Happy 100th Birthday, President Carter.
To put it simply: I admire you so darn much. pic.twitter.com/09DUDUlz9d
— President Biden (@POTUS) October 1, 2024