బ్రసెల్స్: ఏడేండ్ల వయసులో విద్యార్థిగా ఉన్నప్పుడు తనను అవమానించిన టీచర్‌పై కక్ష పెంచుకొన్న ఓ వ్యక్తి 30 ఏండ్ల తర్వాత పగ తీర్చుకొన్నాడు. ఉన్మాదిలా మారి ఒకటి కాదు రెండు కాదు 101 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన బెల్జియంలో 2020లో జరిగింది. నిందితుడు ఉవెంట్స్‌ను దోషిగా తేల్చిన స్థానిక కోర్టు రిమాండ్‌కు పంపించింది. ఇటీవల తన మిత్రుడితో ఈ హత్య గురించి ఉవెంట్స్ వివరించగా అసలు విషయం బయటపడింది.