మళ్లీ లంకకు చేరుకున్న గోటబయ రాజపక్ష
కొలంబో: దేశాన్ని విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్ష శుక్రవారం తిరిగి స్వదేశం చేరుకున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఏడు వారాల క్రితం రాజపక్ష దేశం విడిచి వెళ్లారు. అయితే మళ్లీ స్వదేశానికి వచ్చిన సందర్భంగా ఆయనకు మంత్రులు, రాజకీయవేత్తలు ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. విమానం నుంచి గోటబయ దిగగానే రాజకీయవేత్తలు పూలమాలలతో పరుగెత్తుకు వచ్చినట్లు ఓ ఎయిర్పోర్ట్ అధికారి తెలిపారు. జూలై నెలలో మిలిటరీ సహాయంతో రాజపక్ష దేశాన్ని విడిచి వెళ్లారు. ఆర్థిక సంక్షోభాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు భారీ సంఖ్యలో అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన విషయం తెలిసిందే. తొలుత సింగపూర్, ఆ తర్వాత థాయిలాండ్ వెళ్లిన గోటబయ తన రాజీనామా లేఖను పంపారు. 52 రోజుల పాటు దూరంగా ఉన్న గోటబయ బ్యాంగ్కాక్ నుంచి సింగపూర్ మీదుగా లంక చేరుకున్నారు. ఇన్నాళ్లూ ఆయన ఓ థాయిలాండ్ హోటల్లో ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

