Sali Berisha | అల్బేనియా మాజీ అధ్యక్షుడు సాలి బెరిషాకు చేదు అనుభవం ఎదురైంది. రాజధాని టిరానాలో బుధవారం జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఆయనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దేశంలో ముందస్తు ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలో ప్రతిపక్ష నాయకులతో కలిసి బెరిషా పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా రోడ్డుపై నడుస్తున్న సమయంలో ఎర్ర చొక్కా వేసుకున్న ఓ వ్యక్తి సెక్యూరిటీని దాటుకుని ఒక్కసారిగా బెరిసా వద్దకు వచ్చి ఆయన ముఖంపై చేత్తో బలంగా గుద్దాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ దాడిలో మాజీ అధ్యక్షుడి కంటి కింద చిన్న దెబ్బ తగిలింది. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, నిందితుడు గతంలో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాడని.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు. తనపై పీఎం రామ దాడి చేయించాడని.. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందని సాలి బెరిషా ఆరోపించారు.
Former Albanian president, Sali Berisha, 78, is punched in the face and left with a black eye as thug attacks him during anti-govt protest pic.twitter.com/VcJA72jtpM
— SNOW TV® 📡🎥📺 RC 3662284 (@OfficialSnowtv) December 6, 2022