లండన్, మే 16: క్రిప్టో కరెన్సీ నియంత్రణకు యూరోపియన్ యూనియన్ ప్రత్యేక నిబంధనలను మంగళవారం ఆమోదించింది. క్రిప్టో ఎక్స్చేంజ్ ఎఫ్‌టీఎక్స్ కుప్పకూలిన నేపథ్యంలో క్రిప్టో కరెన్సీపై నియంత్రణ ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిబంధనలకు రూపకల్పన చేసింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో క్రిప్టోలో యూరోపియన్లు పెట్టిన పెట్టుబడులకు రక్షణ కల్పించేందుకు, క్రిప్టో కరెన్సీని మనీలాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు ఇచ్చేందుకు దుర్వినియోగం చేయకుండా ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్టు స్వీడెన్ ఆర్థికశాఖ మంత్రి ఎలిసబెత్ స్వాటెస్సన్ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం క్రిప్టో కరెన్సీ జారీ చేసే సంస్థలు తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.