న్యూయార్క్: ఇటీవల ఓ ఈవెంట్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ సీఈవో ఎరికా కిర్క్(Erika Kirk)ను హగ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన పట్ల ఎరికా స్పందించారు. కెమెరాలు తన ప్రతి కదలికను విశ్లేషిస్తున్నాయని ఛార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ అన్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని పేర్కొన్నది. తన భర్త ఛార్లీ కిర్క్‌ను హత్య చేసిన టైలర్ రాబిన్సన్ కేసులో విచారణ జరగనున్నదని, ఇలాంటి సమయంలో పారదర్శకత అవసరమని ఆమె అన్నారు. తన భర్త మర్డర్ జరిగిన సమయంలో అన్ని వైపులా కెమెరాలు ఉన్నాయని, సంతాప సమయంలో తన స్నేహితులు, కుటుంబసభ్యులపై కెమెరాలు ఉన్నాయని, తనపై అన్ని వైపులా కెమెరాలు ఉన్నాయని, అన్ని కెమెరాలు విశ్లేషిస్తున్నాయని, తన నవ్వులు, తన కన్నీళ్లను అవి విశ్లేషిస్తున్నాయని, కెమెరాలు ఉండడం తప్పు కాదు, కాని అవి పారదర్శకంగా ఉండాలన్నారు. ఇందులో దాచేది ఏమీ లేదన్నారు.
మిసిసిప్పీలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఎరికా కిర్క్ మాట్లాడుతూ.. ఛార్లీని ఎవరూ రిప్లేస్ చేయలేరని, కానీ తన భర్త లాంటి గుణాలు జేడీ వాన్స్‌లో ఉన్నట్లు ఆమె అన్నారు. జేడీ వాన్స్‌ను ఆ సభలో పరిచయం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసిందామె. ఇక స్టేజ్‌పై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఎరికా చాలా చనువుగా ప్రవర్తించారు. ఎరికా నడుముపై జేడీ చేతులుగా వేయగా, ఆమె తన చేతి వేళ్లను జేడీ కురుల్లోకి తీసుకెళ్లింది. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. జేడీ వాన్స్, ఎరికా మధ్య రిలేషన్ ఉన్నట్లు పుకార్లు వ్యాపించాయి. పశ్చిమ దేశాల నాగరికతను కాపాడుకోవాలన్న ఉద్యమాన్ని ఛార్లి నడిపారని, కానీ తానెప్పుడూ అలాంటి వాటికి సైనప్ చేయలేదని, కేవలం ఇష్టపడ్డ వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకున్నాని ఎరికా ఇంటర్వ్యూలో అన్నారు. భర్త ఛార్లీని చంపిన నిందితుడి విషయంపై స్మారక సభలో మాట్లాడుతూ.. తాను క్షమాగుణాన్ని ప్రదర్శిస్తానని అన్నారు. యువతను రక్షించుకోవాలని ఛార్లీ అభిప్రాయపడ్డారని, ఆ యువకుడిని క్షమిస్తున్నాని ఆమె అన్నారు.
మరో వైపు ఎరికా, జేడీ వచ్చే ఏడాది చివరలో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆన్లైన్లో కొన్ని కామెంట్లు వైరల్ అయ్యాయి. భారతీయ మూలాలు ఉన్న ఉష కు జేడీ వాన్స్ విడాకులు ఇచ్చి.. ఎరికాను పెళ్లి చేసుకునే ఛాన్సు ఉందని ఓ ప్రముఖ రచయిత పోస్టు పెట్టడం సంచలనం రేపింది. కానీ ఆ ఆన్లైన్ కామెంట్‌పై ఉష ఇప్పటి వరకు స్పందించలేదు. తన భార్య క్రైస్తవ మతాన్ని స్వీకరించడం లేదని జేడీ వాన్స్ పేర్కొన్న విషయం తెలిసిందే.