ఇంగ్లండ్ రగ్బీ టీమ్ కెప్టెన్‌కు కరోనా పాజిటివ్
Owen Farrel: ఇంగ్లండ్‌కు చెందిన రగ్బీ టీమ్ కెప్టెన్ ఒవెన్ ఫారెల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. త్వరలో ప్రారంభం కానున్న ఓ రగ్బీ సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్న ఇంగ్లండ్ జట్టుకు

లండన్: ఇంగ్లండ్‌కు చెందిన రగ్బీ టీమ్ కెప్టెన్ ఒవెన్ ఫారెల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. త్వరలో ప్రారంభం కానున్న ఓ రగ్బీ సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్న ఇంగ్లండ్ జట్టుకు ఇది గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. రగ్బీ సిరీస్ నేపథ్యంలో ఇటీవల ఆటగాళ్లను ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే శనివారం ఇంగ్లండ్ జట్టు ట్వికెన్‌హామ్ స్టేడియంలో టోంగా జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ జట్టు సభ్యులందరికీ ఎల్ఎఫ్టీ టెస్టు, పీసీఆర్ టెస్టు చేశారు. ఈ పరీక్షల్లో ఒవెన్ ఫారెల్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది.
కరోనా పాజిటివ్ రావడంతో ఒవెన్ ఫారెల్ను ఇంకా ఐసోలేషన్‌లోని ఉంచారు. ఈ రాత్రికి మరోసారి ఆయనకు నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు ఇంగ్లండ్ రగ్బీ జట్టు ప్రతినిధులు తెలిపారు. మళ్లీ అతనికి కరోనా పాజిటివ్‌గానే తేలితే.. సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉన్నది. కాగా, ఇంగ్లండ్ జట్టు సభ్యులకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఒవెన్ ఫారెల్ మినహా మిగతా అందరికీ నెగెటివ్ వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

