షికాగో, జూన్ 14: సూర్యరశ్మి, థర్మల్ రేడియేషన్ నుంచి రక్షణ కల్పించి శరీరాన్ని చల్లగా ఉంచే వస్ర్తాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. షికాగోలోని ప్రిజర్ స్కూల్ ఆఫ్ మాలిక్యులర్ ఇంజినీరింగ్ పరిశోధకుల బృందం ఈ వస్ర్తాన్ని తయారుచేసింది. భవిష్యత్తులో వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు మండిపోతాయని, దాన్ని తట్టుకొనేలా దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు. క్లాత్, బిల్డింగ్, కార్ డిజైన్, ఫుడ్ స్టోరేజీకి ఈ వస్ర్తాన్ని ఉపయోగించవచ్చని పేర్కొన్నారు. ఈ ఫ్యాబ్రిక్ శరీర ఉష్ణోగ్రతను 14 డిగ్రీల ఫారన్హీట్ మేర తగ్గించగలదని వివరించారు.