Blindsight | బ్లైండ్‌సైట్‌తో అంధులకూ చూపు.. అరుదైన ప్రయోగానికి సిద్ధమైన ఎలాన్‌మస్క్ న్యూరాలింక్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మనిషి మెదడులో చిప్ పెట్టిన ఆయన స్టార్టప్ కంపెనీ ‘న్యూరాలింక్'.. ఇప్పుడు చూపు లేని వారికి చూపు తెప్పించే పరికరాన్ని తయారు చేయబోతున్నది.
- చూపులేనివారికి తిరిగి చూపు
- ఎలాన్‌మస్క్ ‘న్యూరాలింక్’కు అనుమతిచ్చిన అమెరికా ఎఫ్‌డీఏ
Blindsight | న్యూయార్క్, సెప్టెంబర్ 18: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మనిషి మెదడులో చిప్ పెట్టిన ఆయన స్టార్టప్ కంపెనీ ‘న్యూరాలింక్’.. ఇప్పుడు చూపు లేని వారికి చూపు తెప్పించే పరికరాన్ని తయారు చేయబోతున్నది. పుట్టుకతో చూపులేని వారికి, మధ్యలో చూపు కోల్పోయిన వారిలో చూపు కల్పించే ‘బ్లైండ్‌సైట్’ డివైజ్‌ను అమర్చేందుకు అమెరికాకు చెందిన యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఈ సంస్థకు అనుమతి ఇచ్చింది. రెండు కండ్లు పోయినా, ఆప్టిక్ నరం దెబ్బతిన్నా.. ఈ పరికరంతో లోకాన్ని చూడొచ్చని కంపెనీ వెల్లడించింది.
పరికరం పని చేస్తుందిలా..
ఎలాన్‌మస్క్ ప్రకారం.. పుట్టుకతో అంధులైన వారికి కూడా ఈ పరికరం ఉపయుక్తంగా పనిచేస్తుంది. దీన్ని వాడిన మొదట్లో దృష్టి సామర్థ్యం తక్కువగా ఉంటుంది.. కాలక్రమేణా సహజమైన కంటిచూపు కంటే మెరుగైన సామర్థ్యం వస్తుంది. అతినీలలోహిత కిరణాలను కూడా ఎలాంటి ప్రభావం లేకుండా భేషుగ్గా చూడొచ్చు. మెదడులోని విజువల్ కార్టెక్స్‌కు ఒక మైక్రో ఎలక్ట్రోడ్‌ను అమర్చి ప్రపంచాన్ని వీక్షించొచ్చు. దానికోసం ఒక కెమెరాను కూడా అమర్చుతారు. దానితో న్యూరాన్లు యాక్టివేట్ అయ్యి చూపును కలుగజేస్తారు. మనుషులపై ప్రయోగాలకు పట్టే సమయంపై మస్క్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

