వాషింగ్టన్: ట్విట్టర్ సంస్థ బోర్డు సభ్యుల్లో ఎలన్ మస్క్ చేరడం లేదని ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ తెలిపారు. ఇటీవల సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్లో మస్క్ 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆ సంస్థలో బోర్డు సభ్యుడిగా చేరుతాడని తొలుత వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పరాగ్ ట్వీట్ చేశారు. బోర్డు సభ్యత్వాన్ని మస్క్ తీసుకోవడం లేదని తన ట్విట్టర్లో పరాగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్విట్టర్ సంస్థలో అత్యధిక షేర్లు కలిగిన వ్యక్తిగా మస్క్ నిలిచారు. పరాగ్ ట్వీట్ చేసిన తర్వాత మస్క్ కూడా తనదైన స్టయిల్లో ట్విట్టర్లో ఓ ఎమోజీతో స్పందించారు.