Elon Musk | బెర్లిన్: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక మద్దతుదారు ఎలాన్ మస్క్ దృష్టి జర్మనీపై పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న జర్మన్ పార్లమెంటు ఎన్నికలు జరుగుతుండటంతో, ఈసారి అధికార మార్పిడి జరగాలని మస్క్ ఓ వ్యాసంలో చెప్పారు. ‘ఈ దేశానికి చిట్టచివరి ఆశాకిరణం ‘ది ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ’ పార్టీ అని తెలిపారు.
ఈ ఫార్ రైట్ వింగ్ పార్టీ దేశాన్ని తీర్చిదిద్దగలదన్నారు. ఆర్థిక సౌభాగ్యం, సాంస్కృతిక సమగ్రత, టెక్నలాజికల్ ఇన్నోవేషన్ అనేవి కేవలం కోరికలుగా మాత్రమే కాకుండా వాస్తవ రూపందాల్చే విధంగా దేశాన్ని నడపగలదని చెప్పారు.