న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనుకున్నంత పనీ చేశారు. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్‌తో విభేదించి ఉన్న ఆయన ట్రంప్ కనుక బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం తెలిపితే వెంటనే తాను అమెరికాలో కొత్త పార్టీ పెడతానని ఇప్పటికే హెచ్చరించారు. అన్నట్టుగానే తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశానని, అమెరికా ప్రజలు కోల్పోయిన స్వాతంత్య్రాన్ని దీని ద్వారా వెనక్కి తీసుకువస్తానని ప్రకటించారు. ‘మీ స్వాతంత్య్రాన్ని వెనక్కి తీసుకురావడానికి ఈ రోజు ‘అమెరికా పార్టీ’ ఏర్పాటైంది’ అంటూ ఎక్స్‌లో పంచుకున్నారు.
ఇప్పటికే అగ్ర రాజ్యంలో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు ప్రధానంగా ఉండగా, మూడో పార్టీ తెర మీదకు వచ్చింది. అమెరికా రాజకీయాల్లో మూడో పార్టీ ఏదీ ఇప్పటివరకు అంత ప్రభావం చూపలేదు. మరోవైపు మస్క్ నుంచి అధికారికంగా పార్టీ నమోదుకు దరఖాస్తు రాలేదని ఈసీ పేర్కొంది.