ఏనుగులు భూమిపై నడిచే అతిపెద్ద జంతువులు. ఇవి చాలా తెలివైన జంతువులు కూడా. వీటిని చూసి మనుషులు భయపడతారు. అడివిలో ఏనుగు కనిపిస్తే ఆమడదూరం పరుగెడతారు. కాగా, శ్రీలంకలోని ఓ హోటల్లో ఏనుగు మాత్రం మనిషిని పక్కకు జరగమని వెరైటీగా అడిగింది. ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు.
ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోను యాలా నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న జెట్వింగ్ యాలా హోటల్లో చిత్రీకరించారు. ఈ వీడియోలో కనిపించిన ఏనుగు 2013 నుంచి ఆ హోటల్లో ఉంటున్నది. చాలా నమ్మకమైన ఏనుగు. ఎవరికీ హాని తలపెట్టదు. కాగా, ఈ వీడియోలో ఓ వ్యక్తి హోటల్ ఆవరణలో నిల్చొని తదేకంగా దేన్నో చూస్తున్నాడు. వెనుకనుంచి వచ్చిన ఏనుగు అతడిపై మట్టి విసిరింది. వెంటనే వెనక్కి తిరిగి చూసిన వ్యక్తి భయంతో పరుగులు తీశాడు. ఆ ఏనుగు ఆ దారిలో ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. ఇప్పటివరకూ 6.5లక్షల వ్యూస్ రాగా, 35వేల మంది లైక్ చేశారు.
Out of the way! 😂
A gentle wild elephant in Sri Lanka calmly walks up to a man and kicks some dirt at him to get him to move aside.. pic.twitter.com/DnrJZX7VLI
— Buitengebieden (@buitengebieden) June 30, 2022