టోక్యో: ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పని వైద్యులు చెబుతుంటారు. కానీ, ఉప్పు ఇచ్చే రుచి కారణంగా దాని వాడకాన్ని తగ్గించలేం. ఈ సమస్యకు పరిష్కారంగా ఎలక్ట్రిక్ స్పూన్, గిన్నెను తయారుచేశారు జపాన్‌కు చెందిన మీజి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఈ ఎలక్ట్రిక్ స్పూన్, గిన్నె విద్యుత్తు ప్రేరణ ద్వారా ఆహారంలో ఉప్పు రుచిని పెంచుతుంది. ఈ గిన్నె, స్పూన్‌తో తినే ఆహారంలో ఒకటిన్నర రెట్లు ఉప్పు రుచి పెరుగుతుందని, తద్వారా ఉప్పు వాడకం తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.