Afghanistan | అఫ్గానిస్థాన్లో మరోసారి కంపించిన భూమి.. గత 15 రోజుల్లో ఇది నాలుగోసారి
అఫ్గానిస్థాన్ (Afghanistan) మరోసారి భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు అఫ్గాన్లో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది.
కాబూల్: అఫ్గానిస్థాన్ (Afghanistan) మరోసారి భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 1.09 గంటలకు అఫ్గాన్లో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 150 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. కాగా, అఫ్గానిస్థాన్లో గత రెండు వారాల్లో భూకంపం రావడం ఇది నాలుగోసారి. ఇటీవల హెరాత్ (Herat) ప్రావిన్సులో సంభవించిన భూకంపం వల్ల 4వేల మందికిపైగా చనిపోయారు.
అక్టోబర్ 15న 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ నెల 13న 4.6 తీవ్రతతో, 11వ తేదీన 6.1 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చింది. ఇక గతవారం వచ్చిన భారీభూకంపం వల్ల 4 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో జనాలు గాయపడ్డారు. భూకంపం ధాటికి 20 గ్రామాల్లో 1983 ఇండ్లు నేలమట్టమయ్యాయని అఫ్గానిస్థాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ప్రకటించింది.
Earthquake of Magnitude:4.3, Occurred on 26-10-2023, 01:09:18 IST, Lat: 37.00 & Long: 72.88, Depth: 150 Km ,Region: Afghanistan for more information Download the BhooKamp App https://t.co/kXBMZoFKIG
@KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/DFfNScnGMP— National Center for Seismology (@NCS_Earthquake) October 25, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

