వాషింగ్టన్: ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో (North Atlantic Ocean) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం రాత్రి 8.28 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని వెల్లడించింది. అయితే ఇప్పటికిప్పుడు సునామీ (Tsunami warning)వచ్చే ప్రమాదం లేదని పేర్కొంది.
ఇక ఆంటిగ్వా (Antigua), బార్బుడాలో (Barbuda) కూడా భారీ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.28 గంటలకు భూమి కంపించిందని యూఎస్జీఎస్ తెలిపింది. దీని తీవ్రత 6.6గా నమోదయిందని, కాడ్రింగ్టన్కు (Codrington) 274 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.
An earthquake measuring 6.6 on the Richter scale occurred 274 km north northeast of Codrington, Antigua & Barbuda: USGS pic.twitter.com/8HSbdDBbo7
— ANI (@ANI) July 10, 2023