Earthquake | ఆప్ఘానిస్థాన్‌ను వణికించిన భారీ భూకంపం
Earthquake | ఆఫ్ఘానిస్థాన్ (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake)తో వణికిపోయింది. మంగళవారం ఉదయం 7.35 గంటల సమయంలో బలమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
Earthquake | ఆఫ్ఘానిస్థాన్ (Afghanistan) మరోసారి భూకంపం (Earthquake)తో వణికిపోయింది. మంగళవారం ఉదయం 7.35 గంటల సమయంలో బలమైన భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
కాగా, ఇటీవలే కాలంలో ఆప్ఘానిస్థాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లో సంభవించిన భూకంపం దేశంలో ఎంతటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పశ్చిమ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపంలో 2 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం కారణంగా వేలాది ఇళ్లు నేలమట్టమై ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Earthquake of Magnitude:5.2, Occurred on 12-12-2023, 07:35:44 IST, Lat: 36.33 & Long: 70.70, Depth: 120 Km ,Location: Afghanistan for more information Download the BhooKamp App https://t.co/xtIRIiPArm @ndmaindia @Indiametdept @KirenRijiju @Ravi_MoES @DDNewslive @Dr_Mishra1966 pic.twitter.com/zu4XPgVJBx
— National Center for Seismology (@NCS_Earthquake) December 12, 2023
Also Read..
Shoaib Bashir | ఆఫ్ స్పిన్‌తో బెంబేలెత్తిస్తున్న యువ కెరటం.. ఇంగ్లండ్ సరికొత్త అస్త్రం ఇతడేనా..?
Asad Shafiq | ఆట మీద ఇష్టం తగ్గిపోయింది.. అందుకే వీడ్కోలు పలుకుతున్నా : పాకిస్థాన్ క్రికెటర్
Hyderabad Traffic | ఈ నగరానికి ఏమైంది.. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

