Asad Shafiq | ఆట మీద ఇష్టం తగ్గిపోయింది.. అందుకే వీడ్కోలు పలుకుతున్నా : పాకిస్థాన్ క్రికెటర్
Asad Shafiq : పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాటర్ అసద్ షఫిక్(Asad Shafiq) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు అతడు సోమవారం సాయంత్రం ప్రకటించాడు. రెండు రోజుల క్రితం నేషనల్ టీ20 కప్ (National T20 Cup)లో...
Asad Shafiq : పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాటర్ అసద్ షఫిక్(Asad Shafiq) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు అతడు సోమవారం సాయంత్రం ప్రకటించాడు. రెండు రోజుల క్రితం నేషనల్ టీ20 కప్ (National T20 Cup)లో కరాచీ వైట్స్(Karachi Whites) జట్టును విజేతగా నిలిపిన అతడు అంతలోనే రిటైర్మెంట్ వార్తతో అందర్నీ షాక్‌కు గురి చేశాడు.
‘నాకు క్రికెట్‌పై మునుపు ఉన్నంత ఉత్సాహం, ఇష్టం ఇప్పుడు లేదు. పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు అవసరమైన ఫిట్నెస్ నాకు లేదు. అందుకనే అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నా. 2020లో జట్టులో చోటు కోల్పోయిన తర్వాత దేశవాళీకే పరిమితమయ్యాను. అయితే.. ఈ మూడేండ్లు మళ్లీ పాక్ జెర్సీ వేసుకుంటాననే నమ్మకంతో ఉన్నా. కానీ, ఈ ఏడాది సీజన్ మొదలయ్యాక నావల్ల కాదనిపించింది. అందుకనే వీడ్కోలు పలకాలని డిసైడ్ అయ్యా’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో షఫిక్ వెల్లడించాడు.
అసద్ షఫిక్

షఫిక్ 2010లో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. 37 ఏండ్ల షఫిక్ పాక్ తరఫున 77 టెస్టులు, 60 వన్డేలు, 10 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ స్టార్ బ్యాటర్ 20414-16 మధ్య టెస్టుల్లో పరుగుల వరద పారించాడు. వరుసగా మూడేండ్లు 2 వేల పరుగులు సాధించి ఔరా అనిపించాడు. అతడి టెస్టు 12 సెంచరీల్లో 6 శతకాలు ఈ టైమ్‌లోనే కొట్టాడు. అయితే.. 2018-19 సీజన్లో షఫిక్ ఆటలో పదును తగ్గిపోయింది. దాంతో, 2020లో సెలెక్టర్లు అతడిపై వేటు వేశారు. అక్కడితో షఫిక్ అంతర్జాతీయ కెరీర్‌కు ఫుల్స్టాప్ పడినట్టు అయింది.
ఇవి కూడా చదవండి
- Readymade House | రెడీమేడ్ ఇండ్లకు యమ క్రేజ్.. రెడీ టూ మూవ్ ప్రాజెక్టులకు హైదరాబాదీల మొగ్గు
- Space Gas stations | అంతరిక్షంలో అధునాతన గ్యాస్ స్టేషన్లు.. ఎందుకో తెలుసా?
- Robbery | పనిచేసిన సంస్థకే కన్నం.. ఐదుగురితో కలిసి రూ.4 కోట్లు దోచిన మాజీ ఉద్యోగి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

