Space Gas stations | అంతరిక్షంలో అధునాతన గ్యాస్ స్టేషన్లు.. ఎందుకో తెలుసా?
హైవేల మీద పెట్రోల్ పంపులు, గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నట్టే రోదసిలోనూ పంపులు ఉంటే ఎలా ఉంటుంది? రోడ్ల మీద కార్లు, ట్రక్కులు తిరుగుతాయి కాబట్టి పెట్రోల్ పంపులు అవసరం.. అంతరిక్షంలో ఎందుకు? అనేగా మీ అనుమానం.
Space Gas stations | న్యూయార్క్, డిసెంబర్ 11: హైవేల మీద పెట్రోల్ పంపులు, గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నట్టే రోదసిలోనూ పంపులు ఉంటే ఎలా ఉంటుంది? రోడ్ల మీద కార్లు, ట్రక్కులు తిరుగుతాయి కాబట్టి పెట్రోల్ పంపులు అవసరం.. అంతరిక్షంలో ఎందుకు? అనేగా మీ అనుమానం. అయితే, రోదసిలో అధునాతన గ్యాస్ స్టేషన్లు, ఇంధన స్టేషన్ల నిర్మాణానికి ఓ అమెరికా స్టార్టప్ కంపెనీ ముందుకొచ్చింది. ఆ కంపెనీ నిర్ణయంపై అంతరిక్ష పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూడా. ఎందుకు??
ఏమిటీ ఈ ప్రాజెక్ట్?
భూమి నిర్ణీత కక్ష్యలో ఇంధన డిపో, గ్యాస్ స్టేషన్ల ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన స్టార్టప్ సంస్థ ‘ఆర్బిట్ ఫ్యాబ్’ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. అమెరికాకు చెందిన ఎయిర్‌ఫోర్స్ రిసెర్చ్ ల్యాబోరేటరీతో కలిసి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నది.
ఎందుకు?
ఇంధనం అయిపోయిన ఉపగ్రహాలు, వాహకనౌకలు రోదసిలో అదేపనిగా తిరుగుతున్నాయి. శిథిలాలుగా మారిన వాటితో అంతరిక్ష కాలుష్యం మినహా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతున్నది. ఒకవేళ వాటిని గ్యాస్ లేదా ఇంధనంతో తిరిగి నింపితే, సేవలను కొనసాగించవచ్చన్న అభిప్రాయం ఇప్పటికే చాలా మంది అంతరిక్ష నిపుణుల్లో ఉన్నది. అయితే, భూమి మీద పెట్రోల్ పంపులు ఉన్నట్టు రోదసిలో ప్రత్యేక ఫ్యుయెల్ పోర్టులు లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకొన్నారు. దీంతో భూ కక్ష్యలో వేలాది ఉపగ్రహాలు, వాహకనౌకలు నిరుపయోగంగా తిరుగుతూ.. వాడుకలో ఉన్న శాటిలైట్ల సేవలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. దీనికి పరిష్కారాన్ని చూయించడంలో భాగంగానే ‘ఆర్బిట్ ఫ్యాబ్’ కంపెనీ ఈ రోదసి గ్యాస్ స్టేషన్లను తీసుకురాబోతున్నది.
లాభాలేంటి?
- అంతరిక్ష కాలుష్యం తగ్గుతుంది.
- రోదసిలోనే స్టేషన్‌ను ఏర్పాటు చేయడం వల్ల చవగ్గానే ఇంధనం నింపొచ్చు.
- నిరుపయోగంగా ఉన్న శాటిలైట్లను వాడుకలోకి తేవడంతో.. కొత్త ప్రయోగాల కోసం వ్యయం చేయాల్సిన పని ఉండదు.
- వాడుకలో ఉన్న శాటిలైట్లకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు.
ప్రాజెక్టు వ్యయం: రూ.166 కోట్లు
ప్రారంభం: 2024 (అంచనా)
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

