Türkiye Earthquake: తుర్కియే భూకంపంలో 84 వేల బిల్డింగ్లు ధ్వంసం
Türkiye Earthquake: తుర్కియే భూకంపంలో సుమారు 84 వేల బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ పట్టణ ప్రణాళిక శాఖ తెలిపింది. కేవలం తుర్కియేలోనే మరణించిన వారి సంఖ్య 40 వేలు దాటింది.
ఇస్తాంబుల్: తుర్కియే(Turkey)లో వచ్చిన భూకంపం(Earthquake) పెను విలయం సృష్టించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి ఆరో తేదీన వచ్చిన భూకంపం వల్ల దేశంలో సుమారు 84,726 బిల్డింగ్(buildings)లు ధ్వంసం అయినట్లు ఆ దేశ పర్యావరణ, పట్టణ ప్రణాళిక మంత్రి మూరత్ కురుమ్ తెలిపారు. తుర్కియేలోని పది ప్రావిన్సుల్లో ఈ నష్టం జరిగినట్లు ఆయన చెప్పారు. అదానాలో డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు.
భూకంపం వల్ల చాలా వరకు బిల్డింగ్లు దెబ్బతిన్నాయని, సుమారు 6 లక్షల 84 వేల బిల్డింగ్‌లను తమ శాఖ పరిశీలించిందని మంత్రి మూరత్ తెలిపారు. అయితే దాంట్లో 84 వేల బిల్డింగ్లు ధ్వంసమైనట్లు గుర్తించిందన్నారు. వీటిల్లో కొన్ని పూర్తిగా కూలిపోయాయి. మరికొన్ని భారీగా డ్యామేజ్ అయ్యాయి. లేదంటే కొన్ని బిల్డింగ్‌లను కూల్చాల్సిన అవసరం ఉందన్నారు. బాగా డ్యామేజ్ అయిన బిల్డింగ్‌లకు ప్రజలు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు.
మార్చిలో కొత్త బిల్డింగ్ నిర్మాణాలను చేపట్టనున్నట్లు అధ్యక్షుడు రీసెప్ తయ్యిప్ ఎర్డగోన్ తెలిపారు. ఏడాదిలోగా ఆ నిర్మాణాలను పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. భూకంపం వల్ల కేవలం తుర్కియేలోనే సుమారు 41 వేల మంది మరణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

