కాబూల్ : అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించి 20 మంది మృతి చెందగా, 300 మందికిపైగా గాయాలపాలయ్యారు. రజ్వా షరీఫ్‌లో ఇండ్లు నేలమట్టమయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైనట్టు యునైటెడ్ నేషన్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్), అఫ్ఘ్ఘానిస్థాన్ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపాయి.
మజర్-ఇ-షరీఫ్ ప్రాంతంలో భూమికి 28 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అధికారులు పేర్కొన్నారు. తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్లోనూ భూమి కంపించిందని, ఆ ప్రాంతాల్లో మొత్తం 5.23 లక్షల మంది జనాభా ఉన్నట్టు వెల్లడించారు.