న్యూఢిల్లీ, అక్టోబర్ 5: అమెరికాతో వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి భారత్ కృషి చేస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఈ చర్చలలో భారత్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను అమెరికా గౌరవించాలని ఆయన స్పష్టం చేశారు. అనేక అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేకపోవడమే భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాల విధింపునకు దారి తీసిందని ఆయన చెప్పారు.
ఆదివారం కౌటిల్య ఎకనమిక్ కాంక్లేవ్(కేఈసీ 2025)లో జైశంకర్ ప్రసంగిస్తూ తమ వాణిజ్య చర్చలలో ఏకాభిప్రాయం కుదరనందునే నేడు అమెరికాతో కొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలను అన్యాయంగా అభివర్ణించిన ఆయన భారతీయ వస్తువులపై విధించిన 50 శాతం సుంకాలను వ్యతిరేకిస్తూ భారత్ చర్చలు జరుపుతోందని చెప్పారు.