Zaporizhzhia power plant: జపొరిజ్జియా పవర్ ప్లాంట్‌పై డ్రోన్ అటాక్.. యూఎన్ ఆందోళన
Zaporizhzhia power plant: జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై ఇటీవల డ్రోన్ అటాక్ జరిగింది. ఆ ఘటన పట్ల ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. పెను అణు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు యూఎన్‌కు చెందిన ఐఏఈఏ పేర్కొన్నది.
కీవ్: ఉక్రెయిన్‌లోని జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్(Zaporizhzhia power plant)పై ఇటీవల డ్రోన్ అటాక్ జరిగింది. ఆ ఘటన పట్ల ఐక్యరాజ్యసమితి అటామిక్ వాచ్డాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. పెను అణు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్లు యూఎన్ పేర్కొన్నది. ఆ డ్రోన్ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్లు రష్యా తెలిపింది. డ్రోన్ దాడిలో సుమారు ముగ్గురు గాయపడ్డారు. కానీ ఉక్రెయిన్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నది.
ఆరు అణు రియాక్టర్లు ఉన్న ఆ ప్లాంట్ ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా మారింది. డ్రోన్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొన్నది. చాలా నిర్లక్ష్యంగా డ్రోన్ అటాక్ చేసినట్లు ఐఏఈఏ అధిపతి రాఫేల్ గ్రోసి తెలిపారు. న్యూక్లియర్ ప్లాంట్ వద్ద ప్రస్తుతం భద్రతాపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు ఆయన వెల్లడించారు.
దక్షిణ ఉక్రెయిన్‌లో ఉన్న జపొరిజ్జియా ప్లాంట్.. యూరోప్‌లోనే పెద్దది. అయితే యుద్ధం మొదలైన తర్వాత దాన్ని రష్యా దళాలు ఆక్రమించేశాయి. 2022 ఫిబ్రవరి నుంచి ఆ ప్లాంట్ రష్యా ఆధీనంలోనే ఉన్నది. జపొరిజ్జియా వద్ద డ్రోన్ దాడి వల్ల స్వల్పంగా భౌతిక నష్టం జరిగినట్లు ఐఏఈఏ నిపుణులు వెల్లడించారు. ఓ రియాక్టర్ కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్లాంట్ వద్ద రేడియేషన్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నాయని, ఎటువంటి సీరియస్ డ్యామేజ్ జరగలేదని ప్లాంట్ సిబ్బంది చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

