వాషింగ్టన్, ఆగస్టు 30: మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అయితే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మతిమరుపు, విషయాలు నేర్చుకోవడంలో సమస్యలు తలెత్తుతాయని తాజా పరిశోధనలో తేలింది. వారం లో 7 కన్నా ఎక్కువ యూనిట్ల ఆల్కహాల్ తీసుకుంటే ఈ రకమైన సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఏడు యూనిట్లు అంటే 1.5 లీటర్ల స్ట్రాంగ్ బీరు లేదా ఐదు గ్లాసుల వైన్ అన్నట్టు. దాదాపు 21 వేల మందిపై యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ అధ్యయనం జరిపింది. పార్కిన్సన్స్, అల్జీమర్స్ వ్యాధుల్లో మెదడులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకునే వారిలో మెదడులో ఎక్కువ ఐరన్ లెవల్స్ గుర్తించారు.