వాషింగ్టన్ : ఒక పసివాడి ప్రాణాన్ని కాపాడటానికి ఒక డాక్టర్ చేసిన దాతృత్వానికి యావత్ ప్రపంచం శభాష్ అని పొగుడుతున్నది. తన శరీరంలోని బోన్ మారో (ఎముక మజ్జ) దానం చేసి నిజమైన ప్రాణదాతగా నిలిచారు.
అమెరికాలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ అలీ అల్సమర ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పిల్లాడికి అవసరమైన బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్‌కు తన బోన్‌మారో ఇచ్చి ప్రజల హృదయాలను గెల్చుకున్నారు. ఆయన చేసిన సాయం ‘గుడ్ న్యూస్ మూవ్మెంట్’ టాగ్‌తో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది.