చిహువాహువా: మెక్సికోలో ఓ జైలు వద్ద ఫైరింగ్ ఘటన జరిగింది. దీంతో ఆ జైలులో ఉన్న ఖైదీలు పరారయ్యారు. ఉత్తర మెక్సికోలోని చిహువాహువా నగరంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. డ్రగ్స్ కార్టెల్‌కు చెందిన గ్యాంగ్.. జైలుపై అటాక్ చేసినట్లు భావిస్తున్నారు. ఆయుధాలతో వాహనాల్లో వచ్చిన దుండగులు.. చిహువాహువా సెంట్రల్ జైలు గార్డులపై ఫైరింగ్‌కు దిగారు. ఆ ఘటనలో పది మంది చనిపోయారు. దాంట్లో నలుగురు ఖైదీలు కూడా ఉన్నారు. అటాక్ సమయంలో జైలులో ఉన్న 24 మంది ఖైదీలు కూడా పరారైనట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు.