Israeli – Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. హమాస్‌ను (Hamas) తుదముట్టించమే లక్ష్యంగా గాజాలో (Gaza) ఇజ్రాయెల్ సైన్యం (IDF) భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా, తాజాగా శనివారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో గాజాలో డజన్ల కొద్దీ పాలస్తీనియన్లు మరణించారు. జబాలియాలోని ఓల్డ్ గాజా స్ట్రీట్‌లో ఇజ్రాయెల్ ప్రయోగించిన వైమానిక దాడుల్లో సుమారు 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో చాలా మంది శిథిలాల కింది చిక్కుకున్నట్లు తెలిపింది.
కాగా, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పుడు సుమారు 240 మందిని బందీలుగా చేసుకుంది. ఇజ్రాయెల్‌లో హమాస్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకూ 1200 మందికిపైగా ప్రజలు మరణించారు. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతిదాడుల్లో హమాస్ వైపు ఇప్పటివరకు 18,700 మందికిపైగా మరణించినట్లు హమాస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read..
Parliament security breach | పార్లమెంట్లో భద్రతా వైఫల్యాలకు కారణం నిరుద్యోగం : రాహుల్ గాంధీ
Gang Raped | కదులుతున్న బస్సులో దళిత యువతిపై సామూహిక అత్యాచారం.. ఒకరు అరెస్ట్
iPhone | యాపిల్ యూజర్లకు కేంద్రం అలర్ట్