పామాయిల్ గెలల రవాణా కాంట్రాక్ట్ రద్దు
సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో పామాయిల్ గెలల రవాణాలో అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ చెలికాని సత్యంబాబు కాంట్రాక్టును రద్దు చేసినట్టు టీజీ ఆయిల్‌ఫెడ్ జీఎం టీ సుధాకర్‌రెడ్డి శనివారం ప్రకటించారు. సకాలంలో కాంటా తూకం వేయకపోవడం, తరుగు తీయడం, తన సొంత పొలాల నుంచి అక్రమంగా అధిక గెలలను రవాణా చేయడం వంటి కారణాలతో రైతుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు.
- ఆయిల్‌ఫెడ్ సంచలన నిర్ణయం
- సత్యంబాబు అక్రమాలపై రైతుల ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో పామాయిల్ గెలల రవాణాలో అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ చెలికాని సత్యంబాబు కాంట్రాక్టును రద్దు చేసినట్టు టీజీ ఆయిల్‌ఫెడ్ జీఎం టీ సుధాకర్‌రెడ్డి శనివారం ప్రకటించారు. సకాలంలో కాంటా తూకం వేయకపోవడం, తరుగు తీయడం, తన సొంత పొలాల నుంచి అక్రమంగా అధిక గెలలను రవాణా చేయడం వంటి కారణాలతో రైతుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు.
అంతేకాకుండా సేకరించిన గెలలను 2 నుంచి 4 రోజుల పాటు నిల్వ ఉంచడం వల్ల (ఎఫ్ఎఫ్ఏ) శాతం పెరిగి అటు ఆయిల్‌ఫెడ్, ఇటు రైతులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. యాజమాన్యం పలుమార్లు హెచ్చరించినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని జీఎం సుధాకర్‌రెడ్డి తెలిపారు. కాంట్రాక్ట్ రద్దు నేపథ్యంలో కఠిన నిబంధనలతో నూతన ఈ-టెండర్ల ప్రక్రియ చేపడుతున్నట్టు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
unknown callers | గుర్తు తెలియని కాలర్స్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కాలర్ పేరు తప్పనిసరి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

