షాంఘై: ఇద్దరు ఒకే దగ్గర పడుకోవద్దు.. ముద్దులు పెట్టుకోవద్దు.. కౌగిలించుకోవద్దు.. కలిసి తినొద్దు.. ఇదంతా ఏంటనుకుంటున్నారా..? కరోనా వ్యాప్తిని నిలువరించడానికి చైనా ప్రభుత్వం విధించిన వింత ఆంక్షలు. ప్రస్తుతం డ్రాగన్ దేశంలో కరోనా విజృంభిస్తున్నది. ప్రముఖ వాణిజ్య నగరం షాంఘై (Shanghai) దానికి కేంద్ర బిందువుగా మారింది. దీంతో నగరంలో గత కొన్నిరోజులుగా కఠినంగా లాక్డౌన్ను అమలు చేస్తున్నది. 26 మిలియన్లకుపైగా జనాభా తమ ఇండ్లకే పరిమితమైంది. ఈ క్రమంలో రోజువారీ కేసులు కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే అది తక్కువే.
కాగా, షాంఘైలో వైరస్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా స్థానిక అధికారులు వింత ఆంక్షలు విధించారు. ఈ రోజు రాత్రి నుంచి జంటగా ఒకేచోట పడుకోవద్దని, కౌగించుకోకూడదని, ముద్దులు పెట్టుకోవడానికి వీళ్లేదని ప్రకటించారు. ఈమేరకు అధికారులు వీధుల్లో తిరుగుతూ చాటింపు వేశారు. ఈ వీడియోను స్థానిక జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
This is more funny. “From tonight, couple should sleep separately, don’t kiss, hug is not allowed, and eat separately. Thank you for your corporation! “ pic.twitter.com/ekDwLItm7x
— Wei Ren (@WR1111F) April 6, 2022