ఇస్తాంబుల్ : ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో ఆసక్తికర చర్చను రేకెత్తించింది. తుర్కియేలోని ఇస్తాంబుల్లో డిస్కౌంట్లపై ఓ హోటల్ చేసిన విజ్ఞప్తిపై నెటిజన్లు సరదాగా స్పందించారు. ‘భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సోదరులారా.. దయచేసి రాయితీ కోసం అడగొద్దు’ అని కేవలం దక్షిణాసియా వాసులకు మాత్రమే ఆ హోటల్లో సూచన ఉండటం తనను ఆకర్షించిందని వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి తెలిపారు. దీనిపై ఒక యూజర్ స్పందిస్తూ.. ‘సరిహద్దుల వల్ల విభజించబడి ఉన్నాం. కానీ అంతర్జాతీయంగా చికాకు కలిగించడంలో ఐకమత్యంగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. మరొకరు ‘వాళ్లు డిస్కౌంట్ కోసం అడగరు.. అర్థిస్తారు.. దాని గురించి అర గంట మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. నాకు వ్యాపారంలో ఇది అనుభవమే.’ అని వ్యాఖ్యానించారు. దక్షిణాసియా మార్కెట్లలో కస్టమర్లు రాయితీలు అడగడం పరిపాటి.