వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎట్టకేలకు శాంతి బహుమతి గెలుచుకున్నారు. అయితే ఓస్లోలోని నోబెల్ కమిటీ ఆ అవార్డును ఇవ్వలేదు. కానీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా ట్రంప్‌కు గౌరవ పీస్ ప్రైజ్‌ను అందజేసింది. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ట్రై చేసినా ఆయనకు ఆ అవార్డు దక్కలేదు. కానీ కన్సోలేషన్ రీతిలో ట్రంప్‌కు ఫిఫా తన తొలి పీస్ ప్రైజ్‌ను అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కొన్ని సంక్షోభాలను పరిష్కరించడంలో ట్రంప్ సక్సెస్ అయ్యారని, దాని కోసమే ఆయనకు అవార్డు అందజేస్తున్నట్లు ఫిఫా తెలిపింది. వాషింగ్టన్‌లోని కెన్నడీ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వచ్చే ఏడాది జరిగే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ టోర్నీని అమెరికాతో పాటు కెనడా, మెక్సికో దేశాలు హోస్ట్ చేయనున్నాయి. వరల్డ్ కప్ డ్రా తీస్తున్న సందర్భంగా జరిగిన ఈవెంట్లో ట్రంప్‌కు స్పెషల్ ప్రైజ్ అందజేసింది. ఆ కార్యక్రమంలో కెనడా ప్రధాని మార్క్ కార్నే, మెక్సికో ప్రధాని క్లాడియా షీన్బామ్ పాల్గొన్నారు. ఫిఫా అధ్యక్షుడు గియన్ని ఇన్ఫాంటినో కూడా కార్యక్రమంలో ఉన్నారు. ఫిఫా పీస్ ప్రైజ్‌ను ఇవ్వనున్నట్లు గత నెలలోనే ఫిఫా ఓ ప్రకటన చేసింది. అవార్డు కార్యక్రమంలో ట్రంప్‌కు ఓ మెడల్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, ఐక్యతను ప్రమోట్ చేసిన ట్రంప్‌కు శాంతి బహుమతి ఇస్తున్నట్లు ఫిఫా అధ్యక్షుడు గియాన్ని తెలిపారు.
The stage is set. Who triumphs? 🏆@aramco | #FIFAWorldCup pic.twitter.com/21qBVC6KlE
— FIFA World Cup (@FIFAWorldCup) December 5, 2025