Stormy Daniels | చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్
అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. మరోసారి అధ్యక్ష బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడ్డారు.
- పోర్న్‌స్టార్‌తో ఒప్పందం కేసులో అభియోగాలు
- క్రిమినల్ చార్జ్‌ను ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షుడు
- రాజకీయ అణచివేత: ట్రంప్
న్యూయార్క్, మార్చి 31: అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. మరోసారి అధ్యక్ష బరిలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో.. స్ట్రామీ డానియల్స్ అనే పోర్న్‌స్టార్‌తో తనకున్న శారీరక సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు ఆమెకు డబ్బు ఇచ్చి అనైతిక ఒప్పందం చేసుకున్నారని ట్రంప్‌పై ఆరోపణలు రాగా.. తాజాగా మన్‌హట్టన్ గ్రాండ్ జ్యూరీ వాటిని ధ్రువీకరించి అభియోగాలు నమోదుచేసింది. దీంతో ఈ అభియోగాలపై ట్రంప్ విచారణ ఎదుర్కొనున్నారు.
అగ్రరాజ్య చరిత్రలో నేరాభియోగాలను ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటకట్టుకున్నారు. అయితే ఆయనపై ఏయే నేరాలపై అభియోగాలు మోపారన్నదానిపై స్పష్టత లేదు. ట్రంప్ లొంగుబాటుపై మన్‌హట్టన్ జిల్లా అటార్నీ.. ఆయన న్యాయవాదులతో చర్చలు జరిపారు. మంగళవారం ట్రంప్ మన్‌హట్టన్ కోర్టులో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజా పరిమాణంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇది రాజకీయ అణచివేత అని మండిపడ్డారు. ఎన్నికల పరంగా ఉన్నతస్థాయిలో జరుగుతున్న జోక్యమని, న్యాయవ్యవస్థను ఆయుధంగా వాడుకుంటున్నారని అన్నారు. ఈ కేసులో ట్రంప్ అరెస్ట్ అవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

