వాషింగ్టన్: ఇరాన్ వార్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక అప్డేట్ ఇవ్వనున్నారు. బుధవారం రాత్రి ఆయన అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వైట్‌హౌజ్ ప్రెస్ కార్యదర్శి కరోలినా లివియట్ ఈ విషయాన్ని వెల్లడించారు. తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని చెప్పారు. మరో వైపు ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతల్లో ఎటువంటి మార్పు లేదు. అమెరికా స్థావరాలపై ఇరాన్ అటాక్ చేస్తూనే ఉన్నది. కానీ వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ మరో విషయాన్ని వెల్లడించారు. మరో రెండు లేదా మూడు వారాల్లో ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే ఆ దేశాన్ని వదలివెళ్తామని ఓవల్ ఆఫీసులో జరిగిన భేటీలో రిపోర్టర్లతో తెలిపారు. ఇరాన్లో ఉన్న అనేక క్షిపణి తయారీ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు. ఇరాన్‌ను మళ్లీ రాతియుగానికి పంపామని, బహుశా ఇప్పట్లో వాళ్లేమీ కోలుకోలేరని, ఆ దేశం న్యూక్లియర్ వెపన్ తయారు చేయలేదని ఆయన అన్నారు.
NOW – Trump says the U.S. will leave the Iran War in 2 or 3 weeks. pic.twitter.com/p0j83neowV
— Disclose.tv (@disclosetv) March 31, 2026