Mohammad Amir : పాకిస్థాన్ మాజీ పేసర్ మొహమ్మద్ అమిర్(Mohammad Amir ) సంచలన ప్రకటన చేశాడు. తాను ఇకపై పాకిస్థానీ కాదని.. ఆ దేశ పౌరుడిగా ఆకుపచ్చ జెర్సీతో మళ్లీ మైదానంలోకి దిగబోనని అమిర్ స్పష్టం చేశాడు. ఇటీవలే తనకు బ్రటన్ పౌరసత్వం వచ్చిందని, ఇక నుంచి అక్కడి స్థానిక క్లబ్స్.. టీ20 లీగ్స్‌లో ఆడేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడీ పేస్ గన్.
పాకిస్థాన్ క్రికెటర్‌గా తన అధ్యాయం ముగిసిందని మొహమ్మద్ అమిర్ పేర్కొన్నాడు. తాను ఇప్పుడు బ్రిటీష్ పౌరుడినని, ఇకపై పాక్ జెర్సీతో ఆడే అవకాశమే లేదని అతడు వెల్లడించాడు. తాజాగా ఓ యూట్యూబర్‌తో మాట్లాడిన అమిర్.. వచ్చే వన్డే ప్రపంచకప్ 2027 పాకిస్థాన్ స్క్వాడ్‌లో మీరు ఉంటారా? అనే ప్రశ్నకు అతడు.. ‘మీకో సులువుగా అర్ధమయ్యేలా చెబుతాను’ అన్నాడు అమిర్.
Q: Can we see Mohammad Amir playing for Pakistan in the 2027 World Cup?
Mohammad Amir:
“Furqan bhai, let me explain this in simple words.I am now a British local.
When you play as a local player in County cricket or The Hundred, you have to sign a document stating that you… https://t.co/aguaMm1QW6 pic.twitter.com/Obiufq97Sg
— Talha Nawaz (@TalhaDigital007) August 29, 2026
‘ఇప్పుడు నేను బ్రిటన్ పౌరుడిని. స్థానిక ఆటగాడిగా కౌంటీ చాంపియన్‌షిప్, ది హండ్రెడ్ లీగ్స్ ఆడేందుకు మరో దేశ పౌరుడిగా ఆడబోనని రాసున్న డాక్యుమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. సో.. ఇంతకుముందులా నేను పాకిస్థాన్‌కు ఆడే అవకాశాలకు ముగింపు పడింది’ అని అమిర్ తెలిపాడు. అయితే.. తాను బ్రిటన్ పౌరుడిగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు సిద్ధమని చెప్పాడతడు.
Mohammad Amir rules out a Pakistan return after acquiring British citizenship 🗣️#MohammadAmir #Pakistan pic.twitter.com/OLaOi3njwj
— CricTracker (@Cricketracker) August 30, 2026
ఎడమచేతి వాటం పేసరైన అమిర్‌తో టీ20 బ్లాస్ట్ కోసం నాటింగ్హమ్షైర్ ఒప్పందం చేసుకుంది. అలానే ది హండ్రెడ్ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడీ పేసర్. పాక్ తరఫున 147 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అమిర్. 259 వికెట్లు తీశాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందిన జట్టులో సభ్యుడైన అతడు.. 2024 డిసెంబర్లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.