న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్( Donald Trump).. ఎలన్ మస్క్ కంపెనీ టెస్లాకు చెందిన కారును కొనుగోలు చేశారు. ఆ ఎరుపు రంగు ఎలక్ట్రిక్ కారు ఖరీదు 80 వేల డాలర్లు. అయితే ఎటువంటి డిస్కౌంట్ తీసుకోకుండానే ఆ కారును కొన్నట్లు ట్రంప్ తెలిపారు. వైట్‌హౌజ్‌లో ఆ కారును ప్రదర్శించారు. ఆ సమయంలో ట్రంప్‌తో పాటు ఎలన్ మస్క్ కూడా ఉన్నారు. ఇద్దరు కారులోకి ఎక్కి కాసేపు ముచ్చటించారు. మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాకు ప్రస్తుతం అమెరికా మార్కెట్లో డిమాండ్ లేదు.
మోడల్ ఎక్స్ కారు కొన్న ట్రంప్ .. డ్రైవర్ సీటులో కూర్చున్నారు. ఆ కారు అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ప్యాసింజర్ సీటులో మస్క్ కూర్చున్నారు. స్టార్ట్ చేసిన కొన్ని సెకన్లలోనే 95 కిలోమీటర్ల వేగాన్ని కారు ఎలా అందుకుంటుందో ట్రంప్ తెలుసుకున్నారు. ట్రంప్ తన కొత్త కారును టెస్ట్ డ్రైవ్ చేయలేదు. కేవలం డ్రైవర్ సీటులో మాత్రమే కూర్చున్నారు. తన టెస్లా కారును .. వైట్‌హౌజ్ సిబ్బంది వాడనున్నట్లు తెలిపారు.
కొత్త టెస్లా కారు ఖరీదు సుమారు 80 వేల డాలర్లు. అయితే పూర్తి డబ్బులు పెట్టి ఆ కారను ట్రంప్ ఖరీదు చేశారు. దీని కోసం ఎటువంటి డిస్కౌంట్ ఆయన తీసుకోలేదు. మస్క్ తనకు డిస్కౌంట్ ఇస్తారని, కానీ తాను తీసుకోవడం లేదన్నారు. మస్క్ దేశభక్తుడు అంటూ ట్రంప్ కీర్తించారు. ఇటీవల ట్రంప్ సుంకాలు విధించడంతో.. టెస్లా కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయిన విషయం తెలిసిందే. సోమవారం టెస్లా కంపెనీ షేర్లు 15 శాతం పడిపోయాయి.
Get in, patriots—we have a country to save.🇺🇸@ElonMusk helps President Trump pick his new @Tesla! pic.twitter.com/VxdKMsOBjW
— The White House (@WhiteHouse) March 11, 2025