వాషింగ్టన్: ఇరాన్‌తో కాల్పుల విరమణపై అమెరికా డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ తన ట్రుత్ సోషల్‌లో ప్రకటన చేశారు. ప్రపంచ శాంతికి ఇది గొప్ప దినం అన్నారు. ఇరాన్ ఇదే కోరుకుంటోందన్నారు. తాజా వార్‌లో ఇరాన్ చాలా దెబ్బతిన్నట్లు చెప్పారు. హోర్ముజ్ జలసంధిలో మళ్లీ చమురు నౌకల సందడి పెరుగుతుందని, దీనికి అమెరికా సహకరిస్తుందన్నారు. చాలా పాజిటివ్ యాక్షన్ ఉండబోతుందన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తారని, ఇరాన్ మళ్లీ పునర్ నిర్మాణ పనలు మొదలుపెడుతుందన్నారు. ఇక రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో స్వర్ణ యుగం ఉండబోతుందన్నారు. తనకు నమ్మకం ఉందన్నారు. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని విక్టరీగా చెప్పుకున్నారు.
ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇండోనేషియా స్వాగతించింది. ఇరు దేశాలు సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పేర్కొన్నది. దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు అని ఇండోనేషియా విదేశాంగ శాఖ ప్రతినిధి యెన్నె మివాంగ్కాంగ్ తెలిపారు.