వాషింగ్టన్: భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు మరో నాలుగు రోజుల్లో అమలులోకి రానున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో అమెరికా రాయబారిని (US Ambassador)ఆకస్మికంగా మార్చేశారు. వైట్‌హౌస్‌లో తనకు అత్యంత సన్నిహితుడు, పర్సనల్ డైరెక్టర్‌గా ఉన్న సెర్గియో గోర్‌ను న్యూఢిల్లీలో నూతన రాయబారిగా సెర్గియో గోర్ (Sergio Gor) నియమిస్తున్నట్లు ట్రూత్ వేదికగా ప్రకటించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం నెలకొనడం, భారీ టారీఫ్‌ల నేపథ్యంలో రష్యాకు భారత్ మరింత దగ్గరవుతున్న తరుణంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది.
‘భారత్‌లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్‌ను నియమిస్తున్నాను. దక్షిణ, మధ్య ఆసియా ప్రత్యేక రాయబారిగానూ విధులు నిర్వహించనున్నారు. సెర్గియో, అతని టీమ్ చాలా తక్కువ సమయంలోనే తమని తాము దేశభక్తులుగా భావించుకునే 4 వేల మందిని నియమించుకున్నారు. తద్వారా తమ ఫెడరల్ ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీల్లోని 95 శాతం ఉద్యోగాలను భర్తీ చేశారు. భారత్‌కు వెళ్లేంతవరకు సెర్గియా ప్రస్తుతం వైట్‌హౌస్‌లో తన పాత విధులను నిర్వహిస్తారు.
Sergiogo 1
సెర్గియో తనకు అత్యంత సన్నిహితునిగా ఉన్నారని, చాలా ఏండ్లుగా తనకు మద్దతుగా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తాన గెలుపు కోసం ఎంతోకృషి చేశారు. అమెరికా అధ్యక్ష సిబ్బందిగా సెర్గియో పాత్ర చాలా కీలకమైనది. నా బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలను పబ్లిష్ చేశారు. మా ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వాటిలో ఒకటైన సూపర్ ఫ్యాక్స్‌ను నడిపారు. తాను పాలనలోకి అడుగుపెట్టాక ఎన్నో మంచి పనులు చేశారు. అమెరికా అధ్యక్ష సిబ్బంది డైరెక్టర్‌గా అతని పాత్ర ఎంతో కీలకం. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశంలో అమెరికా ఎజెండాను పూర్తి చేసేందుకు సెర్గియో తోడ్పడతారు. ఆయన గొప్ప రాయబారి అవుతారు. అతడికి నా అభినందనలు’ అని ట్రంప్ పేర్కొన్నారు.