Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫానీ ట్రంప్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సౌత్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్లోతన ప్రియుడు మైఖెల్ బౌలస్‌ను వివాహం చేసుకున్నారు. ట్రంప్‌కు చెందిన మార్ ఎ లాగో రిసార్ట్‌లో వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ట్రంప్ దగ్గరుండి ఈ పెళ్లి జరిపించారు. టిఫానీని వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చిన ట్రంప్ ఆ తర్వాత ఆమెకు ముద్దుపెట్టి వరుడు మైఖెల్‌కు వధువు చేతిని అందించారు.
పెళ్లి వేడుకలో టిఫానీ తెల్లటి గౌనులో మెరిసిపోయారు. ఈ వేడుకలో ట్రంప్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇవాంకా ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2018లో టిఫానీకి మైఖెల్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా కొన్ని రోజులకు ప్రేమగా మారింది. అనంతరం ఇరు కుటుంబ సభ్యుల అనుమతితో 2021లో వీరిద్దరి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు టిఫానీ ప్రకటించింది.
Wishing @TiffanyATrump and Michael an abundance of happiness and joy as they begin their lives together as husband and wife!
May their love be a source of light in this world! 💙💙💙 pic.twitter.com/3fIjnPQnQC
— Ivanka Trump (@IvankaTrump) November 13, 2022
💙💙💙 pic.twitter.com/9aruuEbIkX
— Ivanka Trump (@IvankaTrump) November 12, 2022
Ready to celebrate @TiffanyATrump and Michael ! 🥰🥳🥰 pic.twitter.com/J0unOuuQmi
— Ivanka Trump (@IvankaTrump) November 12, 2022