సోషల్‌మీడియాలో జంతువుల వీడియోలు భలే నవ్వు తెప్పిస్తుంటాయి. అందులో ముఖ్యంగా కుక్కల వీడియోలు ఫన్నీగా ఉంటాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. టీవీలో మాంసం కనిపించగా, ఓ కుక్క స్క్రీన్‌ను నాకుతున్న వీడియో నెటిజన్లకు నవ్వు తెప్పించింది.
ఈ వీడియోను ‘మై చైనా ట్రిప్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. టీవీలో మాంసాన్ని చూపిస్తుండగా అక్కడే ఉన్న పెంపుడు కుక్క టీవీ స్క్రీన్‌ను నాకుతుంది. చాలాసేపు అలాగే ఉంటుంది. ఆ మాంసాన్ని నోటకరుచుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఇదే వీడియోలో పక్కన మరో గోల్డెన్ రిట్రీవర్ కుక్క యోగా చేస్తూ కనిపిస్తుంది. ఈ రెండు కుక్కల వింత చేష్టలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ వీడియోకు ఇప్పటివరకూ 9.1మిలియన్ వ్యూస్ రావడం విశేషం. 66వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు.
This is Damn delicious!😋😋😋 pic.twitter.com/qCipKbKiCs
— Sharing travel (@MyChinaTrip) June 19, 2022