మన ఏదైనా వస్తువును ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ వచ్చి మనకు పార్సిల్ అందజేస్తాడు. పార్సిల్ ముట్టినట్లు సంతకం తీసుకుంటాడు. కాగా, ఓ వ్యక్తికి పార్సిల్ అందజేయకుండానే ముట్టినట్లు మెసేజ్ వచ్చింది. ఇదేంటని ఆరాతీస్తే ఆ పార్సిల్‌ను తన పెంపుడు కుక్క తీసుకున్నట్లు ఫొటోను రుజువుగా చూపాడు. దీంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.
పాల్ కాన్వే (61) అనే వ్యక్తి ఆన్లైన్లో సన్‌గ్లాసెస్ బుక్ చేశాడు. డెలివరీ బాయ్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టగానే మొదట కుక్క బయటకు వచ్చింది. దీంతో ఆ డెలివరీ బాయ్ పార్సిల్ కవర్‌ను కుక్కచేతిలో పెట్టి రుజువుగా ఫొటో తీసుకొని వెళ్లిపోయాడు. పార్సిల్ తన వద్దకు చేరకుండానే ముట్టినట్లు మెసేజ్ రావడంతో కాన్వే ఆందోళన చెందాడు. ఆ కంపెనీని సంప్రదిస్తే కుక్క పార్సిల్ కవర్ తీసుకుంటున్న ఫొటో పంపారు. ఈ ఫొటో చూస్తుంటే తనకు ఫన్నీగా అనిపిస్తోందని కాన్వే అన్నాడు. కాగా, ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.