Putin Ship @ Italy | 70 కోట్ల డాలర్ల విలువైన పుతిన్ నౌక.. ఎక్కడుందో తెలుసా?!
Putin Ship @ Italy | పుతిన్ నౌక ఒకటి ఇటలీలోని పోర్ట్‌లో నిలిచి ఉంది. దాన్ని జప్తు చేయాలని రష్యా విపక్షనేత నావల్నీ కోరుతున్నారు.
Putin Ship @ Italy | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. యుద్ధ పిపాసిగా ఇప్పుడు ఆయన పేరు అందరికీ సుపరిచితమే. మాజీ సోవియట్ నుంచి విడి వడిన ఉక్రెయిన్ను రష్యాలో కలుపుకునేందుకు దండయాత్రకు దిగారు. అలా దండయాత్రకు దిగడానికి ముందు పుతిన్ తన ఆస్తులు, సంపాదన సురక్షిత ప్రదేశాలకు తరలించాడని వార్తలొచ్చాయి. కానీ, రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ మిత్రులుగా భావిస్తున్న వారు ఓ సంచలన విషయం బయట పెట్టారు. పైన ఫొటోగ్రాఫ్‌లో కనిపిస్తున్న ఓడ.. ఆయనదేనని నమ్మకంగా చెబుతున్నారు. ఇది ప్రస్తుతం ఇటలీలోని పశ్చిమ కోస్తా తీర ప్రాంతంలోని మరీనా కర్రారా నౌకాశ్రయం వద్ద లంగరేసుకుని ఉంది.
ఈ ఓడ ( superyacht ) పొడవు 460 అడుగులు లేదా 140 మీటర్ల పొడవు. దీని యజమాని పుతిన్ అని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని నావల్నీ మిత్రులు చెబుతున్నారు. 700 మిలియన్ల డాలర్ల విలువ గల ఈ ఓడను జప్తు చేయాలని ఇటలీ ప్రభుత్వాన్ని కోరారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన పుతిన్‌ను కట్టడి చేయడానికి విదేశాల్లో… ప్రత్యేకించి యూరప్ దేశాల్లో గల ఆస్తులు, వ్యక్తిగత సంపద వివరాల కోసం అమెరికా, దాని మిత్ర దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
కానీ దీని యజమాని పేరు అధికారికంగా బయటపెట్టలేదు. గమ్మత్తేమిటంటే 140 మీటర్ల ఈ ఓడలో రెండు హెలిప్యాడ్లతోపాటు పలు విలాసవంతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. స్కైహరేజాడ్ అని ఈ ఓడను పిలుస్తున్నారు. ఇందులో రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు రెండు సమానమైన అపార్ట్మెంట్ బ్లాక్‌లు ఉన్నాయట.
స్పా, బ్యూటీ సెలూన్ కూడా కూడా ఏర్పాటు చేసుకున్నారు పుతిన్. యూరప్ దేశాల్లో పుతిన్ ఆస్తులపై కూడా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ ఓడపై దర్యాప్తు జరిపిన నావల్నీ యూట్యూబ్ చానెల్ జార్జి అల్బురోవ్, మరియా పెవ్చిక్ మాట్లాడుతూ.. ఈ ఓడకు కెప్టెన్‌గా బ్రిటిష్ పౌరుడు ఉన్నాడని చెప్పారు. మిగతా ఓడ సిబ్బంది మొత్తం.. రష్యాలోని రెండు సీక్రెట్ సర్వీసెస్ సంస్థలు ఎఫ్ఎస్వో, ఎఫ్ఎస్బీ సిబ్బందేనని పేర్కొన్నారు.
పదేండ్లకు పైగా తాము పుతిన్ అవినీతిపై విచారణ జరిపామని పెవ్చిక్ చెప్పారు. పుతిన్ తన ఆస్తులను తన పేరు మీద ఎక్కడ రిజిస్టర్ చేయలేదని తేలిందన్నారు. ఇటలీ పోర్టులో లంగరేసి కూర్చున్న ఈ ఓడ చుట్టుపక్కల పరిస్థితులను పుతిన్ వ్యక్తిగత గార్డులు, సర్వెంట్లు పర్యవేక్షిస్తుంటారు. స్కైహరేజాడ్ అనే పేరుతో ఉన్న ఈ ఓడ పుతిన్‌దేనని రుజువు చేసేందుకు ఇవి సరైన ఆధారాలని పెవ్చిక్ అన్నారు. తక్షణం ఈ ఓడను జప్తు చేయాలని ఇటలీ ప్రభుత్వాన్ని కోరారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

