బుధవారం 03 జూన్ 2020
International - May 22, 2020 , 01:32:51

ఆరు అడుగుల దూరం సరిపోదు

ఆరు అడుగుల దూరం సరిపోదు

లండన్‌: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యక్తుల మధ్య ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోదని పరిశోధకులు పేర్కొంటున్నారు. గాలి వేగం తక్కువగా ఉన్న సమయాల్లో దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వ్యక్తి నోటి నుంచి వెలువడే తుంపర్లు 18 అడుగుల దూరం వరకు ప్రయాణించగలవని వెల్లడించారు. మధ్యప్రాచ్య దేశం సైప్రస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నికోసియాకు చెందిన పరిశోధకులు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 1,008 తుంపర్ల నమూనాలు, 3.7 మిలియన్ల సమీకరణాల్ని విశ్లేషించి ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్టు చెప్పారు. ఈ వివరాలు ‘ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌' అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 


logo