7 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న డిస్నీ
మల్టీనేషనల్ కంపెనీలను ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి.
లాస్ఏంజెల్స్: మల్టీనేషనల్ కంపెనీలను ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి సాఫ్ట్వేర్ దిగ్గజాలతోపాటు బోయింగ్ వంటి విమానయాన సంస్థలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో వినోద రంగంలో రారాజుగా వెలుగుతున్న వాల్డ్ డిస్నీ కూడా చేరింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 7 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది.

5.5 బిలియన్ల ఖర్చులను ఆదా చేయడానికి, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడంలో భాగంగా కంపెనీలోని 7 వేల మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నామని సంస్థ సీఈవో బాబ్ ఇగర్ వెల్లడించారు. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 3.6 శాతం అని చెప్పారు. కంపెనీలో మొత్తం 2 లక్షల 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిస్నీకి ఇటీవల సబ్స్క్రైబర్లు చాలా వరకు తగ్గిపోయారు. గత మూడు నెలల్లో డిస్నీ+కి వినియోగదారులు ఒక శాతం తగ్గి 168.1 మిలియన్‌కు పడిపోయారు.

నష్టాలు పెరిగిపోతుండటంతో డిస్నీ.. ఇప్పటికే కొత్త నియామకాలను నిలిపివేసింది. అదేవిధంగా బిజినెస్ ట్రావెల్స్‌ను కూడా తగ్గించింది. పర్యటనల విషయంలో తప్పనిసరిగా తమ ఆమోదం పొందాలని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- CEO Bob Iger
- disney
- jobs
- layoffs
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

